Clock Of Nellore ( Podalakuru ) – సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల విద్యాశాఖ అధికారిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల విద్యాధికారి అనుచిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని కొందరు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కాకాణిని ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. ఆయన వైఖరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఉపాధ్యాయులను వేధిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.