Clock Of Nellore ( Nellore ) – గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలి అనే అంశంపై పోలీసులకు అవగాహన కల్పించారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వైద్యులు. శనివారం నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ వెంకట రత్నం ప్రారంభించారు. నెల్లూరులోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసులకు వివరించారు. వ్యక్తికి గుండెపోటు సంభవించినప్పుడు వారిని హాస్పిటల్ తరలించే లోపు ఏం ప్రధమ చికిత్స ఏం చేయాలనే దానిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ విధుల్లో నిత్యం బిజీగా ఉండే పోలీసులు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటారని అన్నారు. అలాంటి సందర్భాల్లో గుండెపోటు వస్తే అప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై తెలుసుకుంటే ప్రాణాలను నిలబెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన కార్యక్రమం పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు అనీల్ కుమార్, పవన్ పాల్గొన్నారు.



