62వ రోజు… కొనసాగుతున్న జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Clock Of Nellore ( Nellore ) – కార్యకర్తల యోగ క్షేమాలను తెలుసుకుని వారికి అండగా ఉండే లక్ష్యంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. శనివారం ఈ కార్యక్రమం 62వ రోజుకు చేరింది. 62వ రోజు నగరంలోని 30వ డివిజన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి పర్యటించారు. డివిజన్ లోని చాణిక్య పురి, రామచంద్రారెడ్డి నగర్ ప్రాంతాల్లోని కార్యకర్తల నివాసాలకు వెళ్లిన కోటంరెడ్డి వారితో ఏకాంతంగా మాట్లాడారు. వారి కుటుంబసభ్యులతో చర్చించారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. వారి సమస్యలను ప్రత్యేకంగా పుస్తకంలో రాసుకున్నారు. 

Read Previous

గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలి… పోలీసులకు మెడికవర్ అవగాహన

Read Next

మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన టిడిపి నేత అబ్ధుల్ అజీజ్…

Leave a Reply

Your email address will not be published.