Clock Of Nellore ( Nellore ) – 2019 ఫిబ్రవరి 14వ తేదీనా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళి అర్పించారు నెల్లూరుజిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్. నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పుల్వామా అమర జవాన్ల చిత్ర పటాలకు ఘనంగా నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం పనిచేసే సైనికుల్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, బిజేపి నేతలు మధు, కార్తీక్, రవి, సాయి, రత్నం, మహేష్, మోహన్, సురేష్ పాల్గొన్నారు.