రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ తొలగింపు… సిఎం జగన్ ఆదేశాలు

Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర​ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్‌.. లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు. ​ వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేసినట్టు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

Read Previous

గూడూరును నెల్లూరులోనే ఉంచండి… కలెక్టర్ ను కోరిన ప్రజా సంఘాలు

Read Next

పుల్వామా అమరవీరులకు యశ్వంత్ సింగ్ నివాళులు…

Leave a Reply

Your email address will not be published.