56వ రోజు… జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట కార్యక్రమం 56వ రోజుకు చేరుకుంది. 56వ రోజైన సోమవారం ఆయన నెల్లూరులోని 31వ డివిజన్ లో చేపట్టారు. డివిజన్ పరిధిలోని శివాజీనగర్, చవట మిట్ట, రాజా రామిరెడ్డి నగర్ ప్రాంతాల్లోని కార్యకర్తలను ఆయన కలుసుకున్నారు. వల్లెపు సుశీలమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైన కార్యక్రమం ఆయా ప్రాంతాల్లోని కార్యకర్తల నివాసాలకు ఆయన ఒంటరిగా వెళ్లి వారితో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. మార్గం మధ్యలో స్థానికంగా ఉన్న వారితో ముచ్చటించి సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని కోటంరెడ్డి వారికి హామీ ఇచ్చారు.

Read Previous

రాకెట్ ప్రయోగాన్ని తిలకించిన కలెక్టర్, ఐజి, ఎస్పీ… తర్వాత దైవ దర్శనం

Read Next

ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి నివాళి అర్పించిన కాకాణి, కోటంరెడ్డి, అజీజ్

Leave a Reply

Your email address will not be published.