రాకెట్ ప్రయోగాన్ని తిలకించిన కలెక్టర్, ఐజి, ఎస్పీ… తర్వాత దైవ దర్శనం

Clock Of Nellore ( Sullurpeta ) – నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో సోమవారం ఉదయం జరిగిన పిఎస్ఎల్వీ – సి52 రాకెట్ ప్రయోగాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కుటుంబ సమేతంగా తిలకించారు. ఆయనతో పాటూ గుంటూరు రేంజ్ డిఐజి త్రివిక్రమ వర్మ కూడా సతీ సమేతంగా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. వారితో పాటూ జిల్లా ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు. నిన్న రాత్రే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్న వీరు… ఇస్రో నూతన అధిపతి డాక్టర్ సోమనాథ్ తో కాసేపు మాట్లాడారు. ఇవాళ తెల్లవారు జామున రాకెట్ ప్రయోగాన్ని వీక్షించి నెల్లూరుకు బయలుదేరారు. మార్గం మధ్యలో సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓతో పాటూ స్థానిక రెవెన్యూ అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం వారు నెల్లూరుకు చేరుకున్నారు.

Read Previous

పిఎస్ఎల్వీ – సి52 రాకెట్ ప్రయోగం విజయవంతం…

Read Next

56వ రోజు… జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Leave a Reply

Your email address will not be published.