Clock Of Nellore ( Gudur ) – అనారోగ్యంతో కన్నుమూసిన టిడిపి సీనియర్ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి భౌతిక కాయానికి పలువురు నివాళి అర్పించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో ఉన్న వారి నివాసానికి పలువురు టిడిపి, వైసీపి, బిజేపి నేతలు వెళ్లి భౌతిక కాయాం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ తదితరులు ఆయనకు నివాళి అర్పించి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.


