గూడూరును నెల్లూరుజిల్లాలోనే కొనసాగించండి… నిరసన తెలిపిన ప్రజలు

Clock Of Nellore ( Gudur ) – గూడూరును శ్రీ బాలాజీ జిల్లాలో కలపవద్దంటూ గూడూరులోని సబ్ – కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఏబివిపి, జనసేన, బిజేపి నేతలు కార్యకర్తలు. గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదంటే నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజనను స్వాగతిస్తున్నామని చెప్పిన ఎమ్మెల్యే వర ప్రసాద్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకుండా ఇష్టారాజ్యంగా జిల్లాల విభజన ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గూడూరు వాసులు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రమైన తిరుపతికి వెళ్లాలంటే 3 గంటల సమయం పడుతుందని అదే నెల్లూరుకు అరగంటలో వెళ్లవచ్చునని చెప్పారు. తక్షణం ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Read Previous

రాయచోటి వద్దు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయండి… కువైట్ లో నిరసన

Read Next

ఆయుష్, న్యాయశాఖ ఖాళీల భర్తీపై కేంద్రాన్ని ప్రశ్నించిన నెల్లూరు ఎంపి ఆదాల

Leave a Reply

Your email address will not be published.