Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీలో ( NUDA ) మంగళవారం అవినీతి నిరోధక్ శాఖ ( ACB ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసిబి డిఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో నెల్లూరులోని నుడా కార్యాలయానికి చేరుకున్న ఏసిబి బృందం పలు రికార్డులను తనిఖీ చేశారు. ఇటీవల నెల్లూరు నగర పాలక సంస్థలో రెండు రోజుల పాటూ ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు ఆధారంగా తెలిసిన సమాచారం మేరకు నుడా కార్యాలయంలోనూ సోదాలు చేశారు. ప్రణాళిక విభాగం అధికారులను ప్రశ్నిస్తూ… రికార్డులను పరిశీలించారు. లే అవుట్లకు సంభందించిన అనుమతులు, ఇతర అంశాలపై ఆరా తీశారు. కొన్ని పత్రాలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.