శభాష్… ఎమ్మెల్యే కోటంరెడ్డికి సిఎం చంద్రబాబు ప్రశంస

Clock Of Nellore ( Nellore ) – వెల్ డన్ శ్రీధర్… చాలా బాగా పనిచేస్తున్నావు… కీప్ ఇట్ అప్… అలాగే కొనసాగించు… అంటూ నెల్లూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సిఎం చంద్రబాబును ఎమ్మెల్యే కోటంరెడ్డి కలిశారు. ఈ నెల 22న ఒకే రోజు 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంపై రూపొందించిన బుక్ లెట్ ను అందించి దాని వివరాలను సిఎంకు తెలియజేశారు. బాగా పనిచేస్తున్నావు, అలాగే ముందుకెళ్లు అంటూ కోటంరెడ్డిని చంద్రబాబు ప్రోత్సహిస్తూ అభినందనలు తెలియజేశారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే సందర్భంలో ఆమంచర్ల సెజ్, త్వరలో పనులు ప్రారంభించనున్న రైల్వే అండర్ బ్రిడ్జిల గురించి కూడా కోటంరెడ్డి… సిఎంకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అత్యధిక నిధులతో అభివృద్ధి చేస్తున్న కోటంరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది.

Read Previous

ఇచ్చిన ప్రతీ మాట నెరవేరుస్తాం : స్పష్టం చేసిన మంత్రి ఆనం

Read Next

నుడా కార్యాలయంలో ACB తనిఖీలు : పలు పత్రాలు స్వాధీనం

Leave a Reply

Your email address will not be published.