Clock Of Nellore ( Kovur ) – భువనేశ్వర్ నుండి బెంగుళూరు వెళ్తున్న నవీన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. నెల్లూరుజిల్లాలోని కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 46 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నలుగుర్ని నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. మరి కొందరు స్వలంగా గాయపడగా వారికి కోవూరు ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
