అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ డే : అవగాహన కోసం వాకథాన్ నిర్వహణ

  • ఈనెల 12న ప్రపంచ ఆర్ధరైటిస్ దినోత్సవం
  • ఆర్ధరైటిస్ సమస్యలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అని అర్ధం
  • ప్రజల్లో అవగాహన కోసం నగరంలో వాకథాన్ నిర్వహించిన అపోలో హాస్పిటల్
  • తక్కువ ఫీజులతోనే స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ
  • ఆర్ధరైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే వైకల్యం సంభవించే ప్రమాదం
  • వివరాలు వెల్లడించిన అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్

 

Clock Of Nellore ( Nellore ) – ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హై బీపి, క్యాన్సర్ లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలా మందిలో ఎక్కువగా ఉంటుందని, ఆర్థరైటిస్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉందని నెల్లూరు 6వ నగర సర్కిల్ ఇన్ స్పెక్టర్ సాంబశివరావు హెచ్చరించారు. ఈనెల 12న ప్రపంచ ఆర్థరైటిస్ డే ను పురస్కరించుకుని శనివారం ఉదయం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిఐ పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్ధోపెడిక్ సీనియర్ సర్జన్స్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ విక్రమ్ రెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజు ఆధ్వర్యంలో ఆర్ధరైటిస్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించిన వాకథాన్ ను 6వ నగర సర్కిల్ ఇన్ స్పెక్టర్ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కు నుండి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వరకూ జరిగిన ఈ వాకథాన్ లో అపోలో వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ ఆర్ధరైటిస్ సమస్యలపై ముఖ్యంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆర్ధరైటిస్ సమస్యలకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అపోలో సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్ధరైటిస్ సమస్యల నుండి బయటపడాలని సూచించారు. వాకథాన్ అనంతరం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ ఆర్థరైటిస్ డే ను పురస్కరించుకుని అపోలో అందించే తక్కువ ఫీజులతో స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్ ను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు. ఆర్ధరైటిస్ సమస్యలకు అతితక్కువ ఫీజులతో రెండు ప్యాకేజీలను ప్రకటించారు. 4590/- రూపాయల విలువైన 9 రకాల ఆర్ధరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం 1999/- రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు. 8590/- రూపాయల విలువైన మరో స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని కేవలం 3999/- రూపాయలకే చేయనున్నట్లు ఈ ఆఫర్ 2025 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్ధోపెడిక్ సీనియర్ సర్జన్స్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ విక్రమ్ రెడ్డిలు మీడియా మాట్లాడారు. ఆర్ధరైటిస్ అంటే కీళ్ల సమస్య అని, ఇందులో దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉన్నాయన్నారు. ఆర్ధరైటిస్ లో చాలా రకాలు ఉన్నాయని, అందులో ఆస్టియో ఆర్ధరైటిస్, రుమటాయిడ్ ఆర్ధరైటిస్, యాంకైలోజింగ్ స్పాండైల్ ఆర్ధరైటిస్, గౌట్, పిల్లల్లో వచ్చే ఆర్ధరైటిస్, లూపస్, సోరియాటిక్ ఆర్ధరైటిస్ వంటివి రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయని చెప్పారు. ఆర్ధరైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కేవలం కీళ్లకే పరిమితం కాకుండా దేహంలోని చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుందని, సకాలంలో వైద్యం అందించడం ద్వారా దాన్ని నివారించవచ్చునన్నారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆర్ధరైటిస్ సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉందని, అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉన్నాయని డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. జాయింట్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వారు అపోలో హాస్పిటల్ ను సంప్రదించాలని, తక్కువ ఫీజులతోనే నిర్వహించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

World Arthritis Day – 2025

Read Previous

నాదీ హామీ… అభివృద్ధిలో నెల్లూరు ఎక్కడికో వెళ్తుంది… సిఎం చంద్రబాబు హామీ…

Read Next

నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు

Leave a Reply

Your email address will not be published.