Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ( వి.ఎస్.యూ ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధకురాలు ఆసిఫా తాజీంకు డాక్టరేట్ ప్రదానం అయింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ జె. విజేత పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసిఫా తాజీం “A Study on Social Media Marketing on Electronic Goods Consumers” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పరిశోధన గుణాత్మకతను ప్రశంసించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, MBA విభాగాధిపతి డాక్టర్ జి. సాయి శ్రవంతి, అలాగే అధ్యాపకులు ఆచార్య సుజా ఎస్. నాయర్, డాక్టర్ పి. చెంచురెడ్డి, గాయత్రి అనుపమ, డాక్టర్ పి. శ్రీవల్లి, డాక్టర్ ఎల్. అరుణ మరియు పరిశోధన విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.