Clock Of Nellore ( Hydarabad ) – ఇటీవల తన చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనారు. షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఓ యాడ్ షూటింగ్ లో ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, చేతికి గాయాలు అయినట్లు ఎన్టీఆర్ టీం వెల్లడించింది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు ప్రాధమిక చికిత్స చేశారు. చేతికి, తలకు కట్టు కట్టారు. రెండు వారాల పాటూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఆయన ఇంటికి తిరికివెళ్లారు. ఎన్టీఆర్ కు స్వల్పగాయాలే అయ్యాయని, అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీం సామాజిక మాధ్యమ వేదికగా తెలియజేసింది.