Clock Of Nellore ( Nellore ) – పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని నెల్లూరుజిల్లా జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రమూకలకు తగిన బుద్ది చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రదాడిలో మృత్యువాత పడ్డ వారికి సంతాపంగా పార్టీ కార్యాలయాల్లో జనసేన పార్టీ జెండాను నేతలు అవనతం చేశారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో పాటూ నగర నియోజకవర్గ కార్యాలయంలోనూ పార్టీ జెండాను అవనతం చేసి మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆపార్టీ నేతలు నూనె మల్లిఖార్జున యాదవ్, దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
