పహల్గామ్ ఉగ్రదాడిలో కావలి వాసి దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) – జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరుజిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు దుర్మరణం చెందారు. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మధుసూదన్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగ రీత్యా ఆయన కుటుంబం బెంగుళూరులోనే స్థిరపడింది. ఈ నేపద్యంలో కుటుంబంతో కలిసి మధుసూదన్ రావు పహల్గామ్ కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జరిగిన ఉగ్రవాదుల దాడిలో మధుసూదన్ రావు దుర్మరణం చెందారు. ఆయన మృతదేహాన్ని కావలికి తీసుకురానున్నారు. మరో వైపు మధుసూదన్ రావు మృతి పట్ల జిల్లా మంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read Previous

కాకాణి కోసం వెతుకులాట… హైకోర్టు నిర్ణయంతో స్పీడ్ పెంచిన పోలీసులు

Read Next

ఉగ్ర దాడి పిరికిపంద చర్య : సంతాపంగా జనసేన జెండా అవనతం

Leave a Reply

Your email address will not be published.