నెల్లూరు రూరల్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల జాతర…

Clock Of Nellore ( Nellore Rural ) – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలా సాగుతున్నాయని ఇప్పటికే 190 కోట్లు మంజూరైనాయని, వచ్చే 5 ఏళ్లలో వెయ్యి కోట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ పరిధిలోని కొండ్లపూడి గ్రామంలో 35 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపి ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోగా, మంజూరైన పనులను కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూరల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్ఠి సారించి అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా విడుదల చేస్తున్నారని తెలియజేశారు. కొండ్లపూడి గ్రామంలో నెలకొన్న అన్నీ సమస్యలను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే మిగిలన పనులకు కూడా నిధులు కేటాయిస్తామని తెలియజేశారు.

Read Previous

వైసీపి ఫిర్యాదు ” తూచ్ ” : తిరస్కరిస్తున్నట్లు తెలిపిన జేసీ కార్తీక్

Read Next

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుజిల్లా పర్యటన : ఎల్లుండి మంత్రి లోకేష్ రాక

Leave a Reply

Your email address will not be published.