ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుజిల్లా పర్యటన : ఎల్లుండి మంత్రి లోకేష్ రాక

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అనగా శనివారం నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి నుండి ఆయన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన వివరాలను జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఉదయం 11 గంటలా 45 నిముషాలకు హెలికాప్టర్ ద్వారా జిల్లాలోని కందుకూరు టిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12 గంటలా 5 నిముషాలకు కందుకూరు మున్సిపాల్టీ పరిధిలోని దూబగుంట శివారు ప్రాంతానికి వెళతారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్ ను ప్రారంభిస్తారు. తర్వాత 12 గంటలా 20 నిముషాలకు దూబగుంట ప్రధాన కేంద్రానికి విచ్చేసి అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో కలిసి పారిశుధ్య పనులు చేయనున్నారు. అలాగే మొక్కలు నాటనున్నారు. తర్వాత దూబగుంట నుండి బయలుదేరి 12 గంటలా 55 నిముషాలకు వ్యవసాయ మార్కెటింగ్ యార్డును పరిశీలించనున్నారు. కొద్ది సేపు అక్కడే విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిముషాలకు కందుకూరు పట్టణ ప్రజలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు ఆ కార్యక్రమంలో గంట పాటూ సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలా 40 నిముషాలకు తిరిగి టిఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా అమరావతికి బయలుదేరనున్నారు.

ఆదివారం నెల్లూరుకు మంత్రి లోకేష్ రాక…
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నాారా లోకేష్ ఈనెల 16వ తేదీ అంటే ఆదివారం నెల్లూరుజిల్లాకు రానున్నారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో జరిగే మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనుమడు వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు. ఆయన పర్యటన వివరాలను కూడా జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఈనెల 16వ తేదీ ఉదయం 9 గంటలా 20 నిముషాలకు విజయవాడ నుండి విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 10 గంటలా 45 నిముషాలకు వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణానికి చేరుకుంటారు. వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ లో పాల్గొని తిరిగి రోడ్డు మార్గాన మధ్యాహ్నం ఒంటి గంటా 10 నిముషాలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రేణిగుంట నుండి విమానంలో హైదరాబాద్ వెళతారు.

Read Previous

నెల్లూరు రూరల్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల జాతర…

Read Next

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో తగ్గిన అవుట్ పేషెంట్ ( ఓపి ) ఫీజులు

Leave a Reply

Your email address will not be published.