Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని సోమవారం నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి ఆలయానికి వెళ్లిన కోటంరెడ్డి దంపతులకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోటంరెడ్డి దంపతులు రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కోటంరెడ్డి దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన పెళ్లి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1989వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున తన వివాహం జరిగిందని, వివాహం అనంతరం అదే రోజు పెళ్లి దుస్తులతోనే తాము అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్లామని గుర్తు చేశారు. మళ్లీ 36 సంవత్సరాల తరువాత పెళ్లి రోజున ఇద్దరం మరో సారి అమ్మవారి దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. 36 ఏళ్ల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిందని, అమ్మవారి ఆశీస్సులతో ఇంకా అలాగే కొనసాగుతుందని నమ్ముతున్నట్లు తెలియజేశారు.
