Clock Of Nellore ( Amaravati ) – కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు… సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు.

Tags: Kovur Mla Vemireddy Prasanthi Reddy Nellore MP Vemireddy Prabhakar Reddy TTD Board 2024 TTD Board Member Vemireddy Prasanthi Reddy Vemireddy Meet CM Chandra Babu