త్వ‌ర‌లో రూ. వెయ్యికే ఇసుక‌… పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – ప్ర‌తీ నెలా 1వ‌తేదీనే రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల మందికే ఫించ‌న్లు అంద‌చేస్తున్న ఘ‌న‌త‌ సీఎం చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌ని… రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ ధీన‌ద‌యాళ్ న‌గ‌ర్‌లో శుక్రవారం 1వ‌తేదీ సందర్భంగా సామాజిక ఫించ‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, కార్పొరేషన్ క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ల‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ పాల్గొని… ల‌బ్ధిదారుల‌కి ఇంటికెళ్లి ఫించ‌న్లు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ప్ర‌తీ నెలా 1వ‌తేదీనే రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల మందికే ఫించ‌న్లు అంద‌చేస్తున్న ఘ‌న‌ట సీఎం చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం రాష్ట్ర ఖ‌జానా ఖాళీ చేసి…రూ. 10 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయింద‌ని మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట ప్ర‌కార‌మే సూప‌ర్ సిక్స్ ని అమ‌లు చేస్తున్నార‌న్నారు. మా మీద కోపంతో మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఫించ‌న్లు స‌క్ర‌మంగా ఇవ్వ‌కుండా స‌చివాల‌యాల‌కు పిలిపించి అవ్వాతాత‌ల్ని నానా ఇబ్బందుల‌కి గురి చేశాడ‌న్నారు. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌తీ నెలా 1వ‌తేదే ఉద‌యం 6 గంట‌ల‌కే పంపిణీ మొద‌లు పెట్టి… అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రూ క‌లిసి ఇంటింటికెళ్లి ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్లు అంద‌చేసి 98 శాతం పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్లు ఇచ్చిన మాట త‌ప్ప‌కూడ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఖ‌జానా ఖాళీ అయినా…ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్లు అంద‌చేస్తున్నార‌న్నారు.

సంవ‌త్స‌రానికి మ‌హిళ‌ల‌కి మూడు సిలిండ‌ర్లు ఉచితంగా ఇచ్చేస్తామ‌ని చెప్పార‌ని… ఆ కార్య‌క్ర‌మాన్ని శ్రీకాకుళంలో సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారన్నారు… ఆ త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అంద‌రూ ప్రారంభిస్తార‌న్నారు. ఈ ప‌థ‌కం అంత త్వ‌ర‌గా అమ‌లు చేయ‌డం ప‌ట్ల రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రూ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. మ‌హిళ‌లంద‌రూ సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నార‌న్నారు. ప్ర‌తీ నెలా నేనే స్వ‌యంగా వ‌చ్చి ఫించ‌న్లు ఇస్తుంటే…ల‌బ్ధిదారుల ఆనందానికి హ‌ద్దులేవ‌న్నారు. ఈ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌ని వైసీపీపై త‌న‌దైన శైలిలో నారాయ‌ణ సెటైర్లు వేశారు. అయినా కూడా ఉచిత ఇసుక పాల‌సీపై వైసీపీ అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తుంద‌న్నారు… గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశాల మేర‌కు అక్టోబ‌ర్ 15వ‌తేదీ వ‌ర‌కు రివ‌ర్‌లో సాండ్ తీసేందుకు వీలు లేద‌న్నారు. అక్టోబ‌ర్ 15 త‌రువాత ఉచిత ఇసుక పాల‌సీని తీసుకువ‌చ్చామ‌న్నారు. నెల్లూరు సిటీ ప‌రిధిలో మైన్స్, రెవెన్యూ, కార్పొరేష‌న్ అధికారులు సుమారు నాలుగు ఇసుక రీచ్‌ల‌ను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. దీనివ‌ల్ల ట్రాక్ట‌ర్ ఇసుక రూ. 4వేల నుంచి 5వేలు ఉంటే…ఒక్క సారిగా రూ. 2వేల నుంచి 1500లోపే ప‌డిపోయింద‌న్నారు. ద‌గ్గ‌ర‌గా ఉంటే రూ. 1500లు, దూరంగా ఉంటే రూ. 2వేల లోపు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇసుక‌ని ఎంతో ఫ్రీగా, స్వేచ్ఛ‌గా తీసుకెళుతున్నార‌న్నారు. మొత్తం మీద ఇసుక రేటు రూ. 1200ల‌కు రావాల‌న్న‌ ఆలోచ‌న‌తోనే ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర ఏరియాలో రీచ్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కి తెలుసున‌ని…వైసీపీ వాళ్లు చేస్తోన్న రాద్ధాంతాన్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని ఎద్దేవా చేశారు. ఏం చేయాలో…ఎలా చేయాలో…నాకు ఒక‌రు చెపాల్సిన అవ‌స‌రం లేద‌ని… నేను అధికారుల‌తో, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో నిత్యం మాట్లాడుతూనే ఉంటాన‌న్నారు. ప్ర‌భుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుంటే…దానిని అమ‌లు చేయ‌డ‌మే మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల బాధ్య‌త అని చెప్పారు. రాబోయే 10, 15 రోజుల్లో ఇసుక వెయ్యి రూపాయ‌ల‌కే వ‌స్తుంద‌ని…ప్ర‌జ‌ల‌కి ఆయ‌న శుభ‌వార్త చెప్పారు.

మేము ధ‌ర‌లు త‌గ్గిస్తే…ఇప్పుడు వైసీపీ వాళ్లు ధ‌ర్నాలు చేయ‌డం ఏంటోన‌ని…అది విడ్డూరంగా ఉంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లు ఎందుకు ధ‌ర్నా చేశారో అర్ధం కాక‌…ప్ర‌జ‌లే న‌వ్వుకుంటున్నార‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల సంక్షేమం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డం రెండు కళ్లు లాంటివ‌న్నారు. రాష్ట్రాభివృద్ధి జ‌రిగితేనే యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌న్నారు. అలాంటి విజ‌న్‌తోనే సీఎం చంద్ర‌బాబు ముందుకెళుతున్నార‌న్నారు. రాష్ట్రానికి ఎంతో ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్నార‌న్నారు. యువ‌నేత‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు కూడా విదేశాల్లో ప‌ర్య‌టిస్తూ…మ‌న రాష్ట్రానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్నారు. రానున్న ఐదేళ్ల‌లో న‌గ‌రంలోని రోడ్లు, డ్రైన్ల‌న్నీ పూర్తిగా కంప్లీట్ చేస్తామ‌ని చెప్పారు. 2019 నుంచి అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాట‌ర్ ప్లాంట్ ప్రాజెక్టులు ఆగిపోయాయ‌ని గుర్తు చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్టుల కోసం హ‌డ్కో లోను రూ. 1100 కోట్ల‌ను మంజూరు చేయించాన‌న్నారు. దాంట్లో హ‌డ్కో లోను ఇచ్చింద‌ని ప‌నులు కూడా ప్రారంభించామ‌న్నారు. హ‌డ్కో నుంచి రూ. 165 కోట్లు రావాల్సి ఉంటే గ‌త ప్ర‌భుత్వం వ‌దిలేసింద‌ని ఆరోపించారు. మా మీద కోపం ఉండ‌వ‌చ్చ‌ని…ప్ర‌జ‌లేం పాపం చేశార‌ని…ఆ రూ. 165 కోట్లు ఎందుకు వ‌దిలేశార‌ని ఆయ‌న గ‌త ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ఇచ్చిన ప్ర‌తీ హామీని ఒక్కొక్క‌టిగా కంప్లీట్ చేసి…నెల్లూరు న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా చేస్తాన‌ని నారాయ‌ణ హామీ ఇచ్చారు. అనంత‌రం రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో నారాయణ విద్యాసంస్థల జియం విజయభాస్కర్ రెడ్డి తో పాటు..మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి… నగర అధ్యక్షుడు మామిడాల మధు.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, 3వ డివిజ‌న్ నాయ‌కులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

  • Minister Dr ponguru Narayana
  • Pensions Distributions In AP
  • AP Sand Rates

Read Previous

మెడికవర్ లో దీపావళి వేడుకలు : లక్ష్మీ పూజ చేసిన వైద్యులు

Read Next

ఈనెల 8 నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమం : బ్రోచర్ ను ఆవిష్కరించిన వేమిరెడ్డి దంపతులు

Leave a Reply

Your email address will not be published.