మెడికవర్ లో దీపావళి వేడుకలు : లక్ష్మీ పూజ చేసిన వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో బుధవారం దీపావళి వేడుకలు జరిగాయి. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు ( Nellore Medicover Hospital ). వేడుకల్లో భాగంగా లక్ష్మీ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు ( Diwali Celebrations ). అనంతరం మెడికవర్ హాస్పిటల్ తరపున డాక్టర్ ధీరజ్ రెడ్డి, డాక్టర్ బింధు రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పండుగ ప్రజల్లో వెలుగులు నింపి, సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, హెచ్.ఆర్. లక్ష్మీ నారాయణ, పిఆర్వో చందు వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Read Previous

సకాలంలో స్పందిస్తే పక్షవాతాన్ని జయించవచ్చు : డాక్టర్ బింధుమీనన్ వెల్లడి

Read Next

త్వ‌ర‌లో రూ. వెయ్యికే ఇసుక‌… పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.