రామ్మోహన్ నాయుడికి విమానయాన, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి శాఖలు

Clock Of Nellore ( Delhi ) – ఆదివారం ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీతో సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన అందరికీ సోమవారం రాత్రి శాఖలను కేటాయిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం ఎంపి కింజరపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయమంత్రిని కేటాయించారు. బిజేపికి చెందిన నరసాపురం ఎంపి భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రిని కేటాయించారు. ఇక తెలంగాణా విషయానికొస్తే కిషన్ రెడ్డికి గనుల శాఖ, బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కేటాయించారు. కీలక శాఖలను పాతవారికే కేటాయించారు.

Read Previous

శ్రీధరన్నా… క్షమించి అక్కున చేర్చుకోండి : విజ్ఞప్తి చేసిన మేయర్ స్రవంతి

Read Next

ఈనెల 12న సిఎంగా చంద్రబాబు ప్రమాణం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించే ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published.