Clock Of Nellore ( Delhi ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపికి సంభందించి ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడుచే ప్రమాణం చేయించారు. రామ్మోహన్ నాయుడు ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత గుంటూరు టిడిపి ఎంపి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ఇంగ్లీష్ లోనే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నరసాపురం బిజేపి ఎంపి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
