Clock Of Nellore ( Nellore ) – విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాత కోత్సవ కార్యక్రమంలో సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీకి నాక్ సంస్థ ఏ గ్రేడ్ ను ఇవ్వడం చాలా మంచి పరిణామం అన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ సమాజానికి మంచి పౌరులను అందిస్తుంది అన్నారు. ప్రముఖ కవి తిక్కన నెల్లూరు జిల్లా కు సంబంధించిన వారేనన్నారు. నెల్లూరు జిల్లాలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువుకున్నారన్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ జిల్లా వాసి అని గుర్తు చేశారు. ఈజిల్లాలోనే ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నారన్నారు. భారతదేశంలో ఉన్న 1168 యూనివర్సిటీలలో 12.3 కోట్ల మంది విద్యార్థులు ఉన్నతస్థాయి చదువులు చదువుకుంటున్నారన్నారు. భారతదేశంలో 80శాతం మంది ఉన్నతశ్రేణి విద్యార్థులు ఇతర దేశాలకు వెళుతున్నారన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
29 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రధానం : వీసీ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ ఉపకులపతి జి.ఎం. సుందరవల్లి మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందర్భంగా 29 మందికి గోల్డ్ మెడల్స్ ను గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. అలాగే స్నాతకోత్సవాల సందర్భంగా 275 మంది డిగ్రీ పట్టాలు, పరోక్షంగా 3వేల 301 మందికి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. విక్రమ సింహపురి యూనివర్సిటీకి నాక్ సంస్థ ఏ గ్రేడ్ ఇవ్వటం వల్ల యూనివర్సిటీలో అనేక రకమైన ఇంజనీరింగ్ కోర్సులు ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చింది అన్నారు. అలాగే యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి మరియు సదుపాయాలు కల్పించుకోవడానికి అవకాశం వచ్చింద న్నారు. రాబోయే రోజుల్లో యువతకు అవసరమైన మరిన్ని కోర్సులు ఏర్పాటుచేసి విద్యను అందించ డానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హరినారా యణన్, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, నుడా వైస్ చైర్మన్ టి.బాపిరెడ్డి డి. ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి , టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
