Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం, యల్లాయపాళెం గ్రామానికి చెందిన సళ్ల మౌళీ యాదవ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ చేతుల మీదుగా బుధవారం డాక్టరేట్ ను అందుకున్నారు. సళ్ల శ్రీనివాసులు – సరోజనమ్మ దంపతుల కుమారుడైన మౌళీ యాదవ్ ఉన్నత చదువే లక్ష్యంగా ముందుకెళుతా విద్యాభ్యాసాన్ని సాగించారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా, కష్టాలనే సవాళ్లుగా స్వీకరించి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసిన మౌళీ, నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయంలో MBA, MSW, Ph,D పూర్తి చేశారు. అలాగే ఆంధ్ర యూనివర్శిటీలో MSC పూర్తి చేసిన మౌళీ యాదవ్ డాక్టరేట్ చేయాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా డాక్టరేట్ దిశగా ముందుకెళ్లారు. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ నందు పరిశోధన విద్యార్ధిగా చేరిన మౌళి… కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ ( CSR ) ఇంటర్ వెన్షన్స్ టువర్డ్స్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ – ఏ స్టడీ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్… అనే అంశంపై గత ఐదేళ్లుగా పరిశోధన చేశారు. యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. మధుమతి పర్యవేక్షణలో సాగిన ఈ పరిశోధన అంశం జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఈ పరిశోధన రిపోర్టును విక్రమ సింహపురి యూనివర్శిటీకి అందజేశారు. యూనివర్శిటీ నిబంధనల మేరకు పరిశోధన పత్రం ఉండటంతో సల్ల మౌళిని డాక్టరేట్ కు ఎంపిక చేశారు. నెల్లూరుజిల్లాలోని వివిధ పరిశ్రమలు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, స్కిల్ డెవలప్ మెంట్, వాతావరణం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇందు కోసం మౌళి ఐదేళ్లు కష్టపడ్డారు. ఎన్నో ఆటంకాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదురొడ్డి పరిశోధనను పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. బుధవారం యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకున్నారు. ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన మౌళి విద్యార్ధి సమస్యలపై పోరాటం సాగిస్తూనే… డాక్టరేట్ ను సాధించడం ఇతర విద్యార్ధులకు ఆదర్శం. మౌళిని ప్రతీ ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకు క్లాక్ ఆఫ్ నెల్లూరు తరపున శుభాకాంక్షలు.
