చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఆదాల సన్నిహితుడు GVN

Clock Of Nellore ( Podalakur ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు గేనేడి వెంకటేశ్వర్లు నాయుడు (GVN) తెలుగుదేశం పార్టీలో చేరారు. రూరల్ టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. శనివారం సాయంత్రం ప్రజాగళం సభకు చంద్రబాబు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరుకు రాగా… కోటంరెడ్డితో కలిసి అక్కడికెళ్లిన వెంకటేశ్వర్లు నాయుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబుకు పసుపు కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. రూరల్ లో కోటంరెడ్డి విజయానికి కృషి చేయాలని సూచించారు.

Read Previous

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ లీగల్ మెట్రాలజీ ఇన్ స్పెక్టర్

Read Next

మాటిస్తున్నా… చేసి చూపిస్తా : ప్రచారంలో నారాయణ హామీ

Leave a Reply

Your email address will not be published.