కోవూరులో వ్యక్తి దారుణ హత్య : భార్యపై అనుమానం

Clock Of Nellore ( Kovur ) – కోవూరులో పాకనాటి అయ్యప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ఇంట్లోనే మంచంపై చనిపోయి ఉండగా కుటుంబసభ్యులు గుర్తించారు. తలపై బలమైన గాయం ఉంది. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యే హత్య చేసి ఉంటుందని అయ్యప్ప సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహేతర సంభందం నేపద్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయరెడ్డి, కోవూరు సిఐ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య దుర్గను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఆమే ఉందని నిర్ధారించుకున్నారు.

Read Previous

మే 13న ఏపి అసెంబ్లీ ఎన్నికలు – జూన్ 4న ఫలితాల వెల్లడి – నోటిఫికేషన్ విడుదల

Read Next

నెల్లూరులో తండ్రీ, తనయ ఎన్నికల ప్రచారం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

Leave a Reply

Your email address will not be published.