Clock Of Nellore ( Nellore ) – వైసీపికి రాజీనామా చేసి మార్చి 2వ తేదీనా తెలుగుదేశం పార్టీలో చేరనున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుధవారం జనసేన పార్టీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, నెల్లూరుజిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు నెల్లూరులోని వేమిరెడ్డి నివాసానికి వెళ్లారు. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
