నెల్లూరు ఫారెక్స్ సంస్థను ప్రారంభించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని టివిఎస్ కళ్యాణ సదన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నెల్లూరు ఫారెక్స్ సంస్థను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఉడాలి సూర్య నాారాయణ ఏర్పాటు చేసిన ఈ సంస్ధ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభం అనంతరం సూర్య నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏ దేశ కరెన్సీ అయినా నెల్లూరు ఫారెక్స్ లో ఎక్సేంజ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇలాంటి సంస్థను నెల్లూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు కాటంరెడ్డి రవీంద్రా రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

విపిఆర్ నివాసం వద్ద కోలాహలం : భారీగా తరలివస్తున్న నేతలు

Read Next

నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కనెక్టెడ్ కేర్ సేవలు

Leave a Reply

Your email address will not be published.