- ఇకపై రోగుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతరాయ పర్యవేక్షణ, 24 గంటల సంరక్షణ
- వార్డు వెలుపల నుండి కూడా రోగి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునే నూతన టెక్నాలజీ
- రోగి ఆరోగ్య క్షీణతను ముందుగానే గుర్తించి వైద్యులను అప్రమత్తం చేయనున్న నూతన టెక్నాలజీ
- నూతన టెక్నాలజీ వల్ల రోగి ఆరోగ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడే అవకాశాలు
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కనెక్టెడ్ కేర్ సేవలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. వార్డు వెలుపల నుండి కూడా రోగి ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య క్షీణత, రోగి ఆరోగ్య స్థిరత్వాల గురించి తెలుసుకుని, రోగి కోలుకునేందుకు వీలుగా ఈ కనెక్టెడ్ సేవలను అపోలో యాజమాన్యం ప్రారంభించింది. గతంలో వార్డు లో ఉండే రోగిని 24 గంటలూ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏవైనా అనుకోని మార్పులు సంభవిస్తే తక్షణమే సంభందిత వైద్యులను అప్రమత్తం చేసే వారు. ఈ ప్రక్రియ మొత్తానికి కొద్ది సమయం పట్టేది. అయితే తాజాగా ప్రవేశపెట్టిన కనెక్టెడ్ కేర్ సేవలతో రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి ముందే రోగికి అనుసంధానం చేసిన Ai టెక్నాలజీ ద్వారా వైద్యులను అప్రమత్తం చేస్తుంది. దీంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి ముందే వైద్యులు రోగి వద్దకు చేరుకుని వైద్య సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. దీని ద్వారా రోగిని ప్రాణాపాయం నుండి కాపాడే పరిస్థితులు గణనీయంగా పెరుగుతాయి.
ఈ కెనెక్టెడ్ సేవలు ఇప్పటికే 20 అపోలో యానిట్లలో 1250 పడకలకు అనుసంధానం చేసి ఉన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితులు రియల్ టైంలో తెలియజేయడమే కాకుండా, రోగి ఆరోగ్య స్థితిలో వచ్చే మార్పులను ఈ టెక్నాలజీ ముందుగానే గుర్తించి వైద్యులకు చేరవేస్తూ మంచి ఫలితాలను ఇస్తుండటంతో నెల్లూరు అపోలో యూనిట్ లో కూడా ఈ సేవలను ప్రారంభించారు. కనెక్టెడ్ కేర్ సేవల ప్రారంభం సందర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్ మాట్లాడుతూ ఈ నూతన టెక్నాలజీ ద్వారా 24 గంటలూ రోగి ఆరోగ్య స్థితిగతులను రియల్ టైంలో వైద్యులకు అందడంతో పాటూ అవాంతరాలను ముందుగానే ఈ Ai టెక్నాలజీ అంచనా వేసి వైద్యులను అప్రమత్తం చేస్తుందని చెప్పారు. దీని ద్వారా తాము ముందుగానే అప్రమత్తమయ్యి రోగికి సంభందిత వైద్య సేవలు అందించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా ఎక్కువ శాతం రోగులు కోలుకునే అవకాశం ఉందన్నారు. అలాగే సమావేశంలో పాల్గొన్న చీఫ్ నెఫ్రాలజిస్ట్ మరియు ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ ఏకె. చక్రవర్తి మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు వస్తాయని, రోగులు కూడా సంతృప్తి చెందుతారని చెప్పారు. హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ ఈ కనెక్టెడ్ కేర్ ప్రోగ్రామ్ ఎంతో అమూల్యమైందని అన్నారు. ఈ సేవల వల్ల రోగులు అత్యుత్తమ సంరక్షణలో ఉంటారని పేర్కొన్నారు. ఈ నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినందుకు అపోలో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ నెల్లూరు యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు.

అపోలో గురించి క్లుప్తంగా… !
1983లో డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెన్నైలో మొట్ట మొదటి సారిగా అధునాతన సౌకర్యాలు, వైద్య పరికరాలతో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించారు. నేడు 71 ఆసుపత్రులు, 6వేల ఫార్మసీలు, 200కి పైగా క్లినిక్ లు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ లతో పాటూ 150 టెలీ మెడిసిన్ సెంటర్ లతో 10వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ఫ్లాట్ ఫాంగా అపోలో రూపాంతరం చెందింది. 2లక్షల సర్జరీలతో ప్రపంచంలోనే ప్రముఖ కార్డియాక్ సెంటర్ గా మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ క్యాన్సర్ కేర్ ప్రొవైడర్ గా అపోలో నిలిచింది. మొత్తం ఒక లక్ష మంది అపోలో గ్రూపులో పనిచేస్తున్నారు.