Clock Of Nellore ( Nellore ) – వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి ఆ సమయంలో రాజకీయ ఆరంగ్రేటం తదితర అంశాలతో కూడిన చిత్రం యాత్ర – 2. ఈ సినిమా గురువారం విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని వైసీపి నేతలు తిలకించారు. నెల్లూరులో కూడా నగర మేయర్ స్రవంతి, పలువురు కార్పొరేటర్లు థియేటర్ కు వెళ్లి యాత్ర – 2 చిత్రాన్ని వీక్షించారు. మేయర్ తో పాటూ కార్పొరేటర్లు యాకసిరి వాసంతి, కువ్వాకుల విజయలక్ష్మి, దాసరి అమృత, కో – ఆప్షన్ సభ్యురాలు మొబీనా తదితరులు ఉన్నారు.
