అధికారంలోకి రాగానే పెండింగ్ పనుల పూర్తి : పొంగూరు నారాయణ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో మాజీమంత్రి, నగర టీడీపీ ఇన్‌చార్జ్‌ పొంగూరు నారాయణ గడపగడపకూ వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలను ఇటీవల ముమ్మరం చేసిన ఆయన నారాయణ….ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను అప్యాయంగా పలకరిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ డివిజన్‌లో సోమవారం నారాయణ, నగర టిడిపి అధ్యక్షుడు మామిడాల మధుతో కలిసి పర్యటించారు. ఆయనకు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించి డివిజన్‌ పర్యటనకు ఆహ్వానించారు. మహిళలు కర్పూర హారతులు అందించి స్వాగతించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్ళిన నారాయణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా నగర వాసులకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

Read Next

నెల్లూరు రూరల్ లో జగనాసుర దహనం : ప్లకార్డులు దహనం చేసిన టిడిపి నేతలు

Leave a Reply

Your email address will not be published.