శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో దేవీశ‌ర‌న్న‌వ‌ రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని సోమ‌వారం మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌కు ఆల‌య గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో అర్చకులు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబునాయుడు త్వ‌ర‌గా విడుద‌ల కావాల‌ని, ప్ర‌జలంతా సుభిక్షంగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి, ఆల‌య క‌మిటీ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read Previous

అక్రమ మైనింగ్ వ్యవహారం : మీరంటే మీరంటూ వైసీపి, టిడిపి నేతల పరస్పర ఆరోపణలు

Read Next

అధికారంలోకి రాగానే పెండింగ్ పనుల పూర్తి : పొంగూరు నారాయణ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.