నెల్లూరు రూరల్ లో జగనాసుర దహనం : ప్లకార్డులు దహనం చేసిన టిడిపి నేతలు

Clock Of Nellore ( Nellore ) – టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగనాసుర దహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో నేతలు నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటూ ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఈ కార్యక్రమంలో వారు పాల్గొనలేదు. పార్టీ జిల్లా నేతలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా సైకో పోవాలి అంటూ ఉన్న ప్లకార్డులను దహనం చేశారు. కల్తీ ప్రభుత్వం పోవాలి… హెల్తీ ప్రభుత్వం రావాలి అంటూ నినాదాలు చేశారు.

 

Read Previous

అధికారంలోకి రాగానే పెండింగ్ పనుల పూర్తి : పొంగూరు నారాయణ వెల్లడి

Read Next

నెల్లూరు DRO గా బాధ్యతలు స్వీకరించిన లవన్న

Leave a Reply

Your email address will not be published.