వైసీపి పెద్దలతో మేయర్ దంపతుల భేటీ : పార్టీలో చేరడమే తరువాయి

Clock Of Nellore ( Nellore ) – టిడిపిలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిభిరాన్ని వదిలి బయటకొచ్చిన నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ లు గురువారం వైసీపి పెద్దలను కలిశారు. బుధవారం తాడేపల్లికి వెళ్లిన మేయర్ దంపతులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యి తమ అభీష్ఠాన్ని వెల్లడించారు. తిరిగి పార్టీలో కొనసాగేలా నిర్ణయాన్ని వెలిబుచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు నెల్లూరుకు చేరుకున్న మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ లు గురువారం వైసీపి జిల్లా అధ్యక్షులు మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడే ఉన్న నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందజేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా పుష్ప గుచ్ఛం అందజేశారు. ఇకపై ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. వారితో పాటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

Read Previous

ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాకిచ్చిన మేయర్ స్రవంతి : వైసీపిలో కొనసాగేందుకు నిర్ణయం

Read Next

వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసే పోటీ : పవన్ కళ్యాణ్ స్పష్టం

Leave a Reply

Your email address will not be published.