ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాకిచ్చిన మేయర్ స్రవంతి : వైసీపిలో కొనసాగేందుకు నిర్ణయం

Clock Of Nellore ( Nellore ) – శ్రీధరన్న ఆదేశిస్తే మేయర్ పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ గతంలో వెల్లడించిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాకిచ్చారు. కోటంరెడ్డి శిభిరం నుండి బయటకొచ్చి ఇకపై వైసీపిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. భర్త జయవర్ధన్ తో కలిసి బుధవారం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని మేయర్ స్రవంతి కలిసినట్లు సమాచారం. వైసీపి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆపార్టీ నుండి దూరంగా జరిగిన తర్వాత మేయర్ స్రవంతి కూడా కోటంరెడ్డికి మద్దుతు తెలుపుతూ ఆమె కూడా వైసీపికి దూరంగా జరిగారు. ఆ తర్వాత కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా, మేయర్ భర్త జయవర్ధన్ కూడా చంద్రబాబు చేతుల మీదుగా టిడిపి కండువా కప్పుకున్నారు. మేయర్ మాత్రం టిడిపిలో చేరకపోయినా అనధికారికంగా టిడిపిలో ఉన్నట్లే వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ టిడిపి ఇంఛార్జ్ గా నియమితులైన తర్వాత నిర్వహించిన టిడిపి మహాశక్తి కార్యక్రమాల్లో కూడా మేయర్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 17వ తేదీనా నెల్లూరుకు విచ్చేసిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఆర్ అండ్ బి అతిధి గృహంలో మేయర్ స్రవంతితో పాటూ ఆమె భర్త జయవర్ధన్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నెల్లూరు సిటి నియోజకవర్గానికి సంభందించిన సమీక్ష నిర్వహించగా ఆ సమీక్షలో సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ గత 15 రోజులుగా కోటంరెడ్డి శిభిరంలో మేయర్ గానీ, ఆమె భర్త గానీ కనిపించలేదు. తాజాగా బుధవారం మేయర్ స్రవంతి, భర్త జయవర్ధన్ ఇద్దరూ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలో కలిసినట్లు తెలిసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వైసీపి నేత కూడా మేయర్ తిరిగి వైసీపిలో చేరుతున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతుంది.

 

Reporter – Gopinath

Read Previous

చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు : రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు

Read Next

వైసీపి పెద్దలతో మేయర్ దంపతుల భేటీ : పార్టీలో చేరడమే తరువాయి

Leave a Reply

Your email address will not be published.