నెల్లూరుజిల్లాలో 5 మందిపై పిడి యాక్ట్ : గంజాయి అమ్ముతుండటంతో పోలీసుల చర్యలు

Clock Of Nellore ( Nellore ) – ఎన్ని సార్లు అరెస్టు చేసినా గంజాయి విక్రయాలను మానుకోకపోవడంతో నెల్లూరులో 5 మందిపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పిడి యాక్ట్ ను ప్రయోగించారు. 5 మందిని జైలుకు పంపారు. నెల్లూరు నగరంలోని కపాడి పాళెంకు చెందిన అరవ రాజమ్మ, షేక్ ముంతాజ్, షేక్ సుభాని, షేక్ సిరాజ్, వెంగళరావు నగర్ కు చెందిన చెరుకూరి వెంకటేశ్వర్లు అనే 5 మంది గతంలో గంజాయి విక్రయాలు చేస్తూ అనేక మార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చి ఉన్నారు. ఈ 5 మందిని పోలీసులు పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోకుండా గంజాయి విక్రయాలను చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్ఠి సారించిన జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. బుధవారం ఈ 5 మందిపై పిడి యాక్ట్ ను నమోదు చేసి జైలు పంపారు. ఎక్కడ గంజాయి రవాణా, విక్రయాలు, సేవించడం తెలిసినా ప్రజలు డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.

Read Previous

వేరు వేరు ప్రాంతాలు : ఇద్దరు అనుమానాస్పద మృతి

Read Next

జిల్లాలో విస్త్రృతంగా సాగుతున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్

Leave a Reply

Your email address will not be published.