నెల్లూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తిరుమలేశ్వర రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా డాక్టర్ కె. తిరుమలేశ్వర రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య తన ఛాంబర్ కు చేరుకున్న తిరుమలేశ్వర రెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నేర నియంత్రణలో భాగంగా ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా నెల్లూరును మార్చడమే లక్ష్యమన్నారు. ఎలాంటి వారైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నూతన ఎస్పీని కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
 

 

Read Previous

కసుమూరు దర్గాను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Read Next

నెల్లూరు కమిషనర్ గా వికాస్ మర్మట్ బాధ్యతల స్వీకరణ : అనంతరం జేసీ, మేయర్ తో భేటీ

Leave a Reply

Your email address will not be published.