Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వ్యవసాయ బడ్జెట్ ప్రతులను అందుకున్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి కాకాణి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సభలో వ్యవసాయ బడ్జెట్ ను చదివి వినిపించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, అందుకు నిదర్శనం ఈ బడ్జెట్టేనని పేర్కొన్నారు.
