వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షునిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియామకం

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంభందించి అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 22 విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైఎస్ఆర్ సేవా దళ్ అధ్యక్షునిగా నియమించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాజకీయాల్లోనూ వ్యూహ ప్రతి వ్యూహాలు రచించడంలో దిట్టగా మారారు. ఆయన సేవలను, పనితనాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపి పార్టీ అనుబంధ విభాగమైన వైఎస్ఆర్ సేవాదళ్ కు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. దీనిపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరో వైపు గిరిధర్ రెడ్డి పదవి రావడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బాణా సంచా పేల్చి కోటంరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంక్షించారు. మరో వైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడ్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్ధన్ కూడా గిరిధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.

Read Previous

అవినీతి, అక్రమాల్లో కోటంరెడ్డి నెంబర్ వన్ : ఆరోపించిన అబ్ధుల్ అజీజ్

Read Next

రణగొణ ధ్వనులపై నెల్లూరు పోలీసుల ఉక్కుపాదం : 173 టూవీలర్ సైలెన్సర్ల ధ్వంసం

Leave a Reply

Your email address will not be published.