పన్నులు సకాలంలో చెల్లించండి : యాడ్ ఏజన్సీ నిర్వాహకులకు కమిషనర్ విజ్ఞప్తి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని యాడ్ ఏజెన్సీ నిర్వాహకులను కమిషనర్ హరిత కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది, యాడ్ ఏజెన్సీ నిర్వాహకులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యాడ్ ఏజెన్సీలకు డిస్ ప్లే డివైస్ ఫీస్ గురించి వివరించి, ప్రకటనల నిర్వాహకులకు ఉన్న సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. యాడ్ ఏజెన్సీ నిర్వాహకులకు ఉన్న అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించాలని, పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. యాడ్ ఏజెన్సీల పన్నుల బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. వాణిజ్య ప్రకటనల ప్రదర్శనలకు నగర పాలక సంస్థ సూచించిన మార్గదర్శకాలను యాడ్ ఏజెన్సీలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భారీ హోర్డింగ్స్ ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రకటనలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు, నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో అంబరాన్నంటిన ప్రీ క్రిస్మస్ వేడుకలు : కోటంరెడ్డికి ఆశీర్వాదాలు

Read Next

విద్యార్ధులకు ట్యాబ్ లు : పంపిణీ చేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.