200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) – జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరంలో చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి వినోద్ రెడ్డి భారీ ప్రదర్శన చేపట్టారు. ఏబిఎం కాంపౌండ్ నుండి తడికల బజార్ సెంటర్ వరకూ భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఏబిఎం వద్ద నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత ప్రదర్శనగా బయలుదేరి ఆత్మకూరు బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు వినోద్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. జనసేన పార్టీ వీర మహిళలు కేతంరెడ్డికి వీరతిలకం దిద్ది హారతులిచ్చారు. వివిధ వర్గాలకు చెందిన వారు అక్కడే కేతంరెడ్డిని కలిసి తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చి పవన్ కళ్యాణ్ దృష్ఠికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టోన్ హౌస్ పేట మీదుగా డప్పు వాయిద్యాలు, బాణా సంచా పేలుళ్ల, మంగళ వాయిద్యాల మధ్య తడికల బజార్ సెంటర్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అడుగడుగునా స్థానిక ప్రజలు కేతంరెడ్డికి స్వాగతం పలుకుతూ పూలమాలలతో సత్కరించారు.

జనసేన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం నియంతంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమన్నారు. గత 200 రోజులుగా నిర్విరామంగా తాను పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, ప్రజలంతా తననెంతో ఆదరిస్తున్నారని, నెల్లూరు నగరం మొత్తం పర్యటించే దాకా ఎన్ని రోజులైనా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటానని కేతంరెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్ని జనసేన పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళీ రెడ్డి, సారధి కనకేశ్వర రావు, కార్తీక్, హేమంత్ రాయల్, ప్రభాకర్, జీవన్, రాము, వర ప్రసాద్, విజయ్, జాఫర్, శ్రీకాంత్, చరణ్ తేజ, సుజయ్ సింగ్, ఝాన్సీ, సునంద, సృజన, కుసుమ, జయశ్రీ పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు నక్షత్ర స్కూల్లో లైంగిక వేధింపుల వివాదం : ఆందోళన చేపట్టిన కుటుంబసభ్యులు

Read Next

ఈనెల 7న సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

Leave a Reply

Your email address will not be published.