Clock Of Nellore ( Delhi ) – నైరుతీ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. అది 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం నెల్లూరుకు 420 కిలోమీటర్లు, చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కొనసాగుతుంది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మంగళవారం రాత్రి కల్లా బలహీన పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాతో పాటూ చెన్నైలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. రేపు ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
