Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని చాణుక్యపురి వి.ఎం.ఆర్ నగర్ లో నివాసాలపై వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్ లైన్ ను మార్చెే పనులను వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల నుడా నిధులతో ఈ పనులు చేపడుతున్నారు. వైద్యుత్ లైన్ మార్పు సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు స్థానికులు ఈ విద్యుత్ లైన్ గురించి చెప్పారన్నారు. విద్యుత్ లైన్ నివాసాలపై నుండి వెళ్తుండటంతో నిత్యం భయం భయంగా జీవించాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా విద్యుత్ అధికారులతో మాట్లాడి పూర్తిగా విద్యుత్ లైన్ ను మార్చివేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, డివిజన్ వైసీపి ఇంఛార్జ్ సాయిరెడ్డి, ఏఎంసి ఛైర్మైన్ హరిబాబు యాదవ్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
