మౌలిక సదుపాయాలకు పెద్దపీట : గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన నెల్లూరు 42వ డివిజన్ లోని ఖుద్ధూస్ నగర్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైన్ల సమస్య ఉందని స్థానికులు చెప్పడంతో వెంటనే స్పందించిన అనీల్ కుమార్ యాదవ్ డ్రైన్ల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ఖుద్ధూస్ నగర్ లో పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తానని స్థానికులకు ఎమ్మెల్యే అనీల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ షేక్ కరీముల్లా, వైసీపి నేతలు పాల్గొన్నారు.

Read Previous

ప్రపంచ మత్స్య దినోత్సవం : 21 మందికి బోట్లు, వలలు, మోటార్లు అందించిన జేసీ కూర్మనాథ్

Read Next

ఒక్కడన్నాడు.. ముగ్గురొచ్చారు… దిశకు ఫోన్ చేసి బయటపడ్డ యువతి

Leave a Reply

Your email address will not be published.