Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. 35వ డివిజన్ లో సోమవారం ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన నీలగిరి సంఘంలో 35వ డివిజన్ కు చెందిన వైసీపి కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారిని అడిగి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ 35వ డివిజన్ లో డ్రైనేజీ కాలువలపై ప్రత్యేక దృష్ఠి సారించినట్లు పేర్కొన్నారు. 46 లక్షలతో చేపట్టే డ్రైన్ల పనులకు వారం రోజుల్లో శంఖుస్థాపన చేస్తానని, 3 నెలల్లో పనులు పూర్తవుతాయని కోటంరెడ్డి తెలియజేశారు. ప్రజలతో పాటూ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య ఉన్నా తమ కార్యాలయానికి రావాలని, లేదంటే తనకైనా ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమం అనంతరం నేతలు, కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి తదితరులు పాల్గొన్నారు.
