Clock Of Nellore ( Nellore ) – గత మూడు దశాబ్దాలుగా చిన్నపిల్లల వైద్యరంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న నెల్లూరుకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. రిచ్ చిన్నపిల్లల హాస్పిటల్ ను నెల్లూరులో స్థాపించి 30 సంవత్సరాలు చిన్నపిల్లల వైద్యాన్ని అత్యాధునిక వైద్యసేవలతో అందిస్తున్నారు. సామాన్యులకు సైతం తమ హాస్పిటల్ అందుబాటులో ఉంచారు. డి.ఎన్.బి కోర్సు ద్వారా యం.బి.బి.యస్. చదివిన వైద్య విద్యార్థులకు చిన్నపిల్లల వైద్యంలో అత్యుత్తమ శిక్షలను ఇచ్చి, వారిని నిష్ణాతులుగా తయారు చేసారు. అత్యాధునిక నియోనటల్ కేర్ యూనిట్ కలిగి అధునాతనమైన చిన్నపిల్లల శస్త్ర చికిత్స విభాగం కలిగిన ఏకైక చిన్నపిల్లలు హాస్పిటల్ నెల్లూరులోని రిచ్ హాస్పిటల్.

ఇంత అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగి ప్రత్యేకంగా పురిటి పిల్లలకు నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మరియు నియోనటల్ సర్జికల్ యూనిట్ కలిగిన రిచ్ హాస్పిటల్ లో పురిటి పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందిస్తూ, ఎం.బి.బి.ఎస్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ( డి.ఎన్.బి ) లో చేరిన డాక్టర్లకు వైద్య విద్యను అందిస్తున్నందుకు గానూ ది బెస్ట్ చిల్డ్రన్ డాక్టర్ మరియు బెస్ట్ డి.ఎన్.బి టీచర్ గా ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ టి. రవికుమార్ కు న్యూ ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడియేషన్ వారి గుర్తింపు లభించింది. న్యూ ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ అక్రిడియేషన్ ఇనిస్టిట్యూషన్స్ హానరబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్ పాయ్ చేతుల మీదుగా డాక్టర్ రవికుమార్ అవార్డును అందుకున్నారు. దీనిపై డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతీ బిడ్డకూ వైద్యం అందాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభిజిత్ షెత్, డాక్టర్ బి. బాలరాజు, డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
