వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) – బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మొదట అండమాన్ సమీపంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం నెల్లూరు – చెన్నై మధ్యలోకి రానుంది. అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా రూపాంతరం చెంది వాయుగుండంగా మారింది. అది చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. అది తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ కు మధ్య ఉన్న నెల్లూరు – చెన్నై సమీపంలోకి రానుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో సోమవారం నుండి రెండు రోజుల పాటూ ఏపిలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వారం రోజుల పాటూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Read Previous

చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు : మంత్రి కాకాణి విమర్శ

Read Next

ఈనెల 26న పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం

Leave a Reply

Your email address will not be published.